హైదరాబాద్: ‘ఇప్పుడు ఏమి చేయాలి కరోనా’ అంటున్నారు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఆయన ఈ కామెంట్ చేసింది మనుషుల గురించి కాదు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోరా మహమ్మారిని ఉద్దేశించి ఈ మాట అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో జనం ప్రాణాలను ‘కోవిడ్-19’ హరిస్తున్న నేపథ్యంలో బాధిత దేశాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. ప్రజలందరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఆంక్షలు విధించాయి. మనదేశంలోనూ లాక్‌డౌన్ కొనసాగుతోంది. అత్యవసర సేవల సిబ్బంది తప్పా జనమంతా ఇళ్లకే పరిమితమయ్యారు.
ఇప్పుడు ఏమి చేయాలి ‘కరోనా’